మరింతగా తగ్గిన పెట్రోలు ధరలు!

  • ఆదివారం నాడు పెట్రోలుపై 25 పైసలు తగ్గింపు
  • డీజిల్ పై 17 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటన
  • హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 86.90 
పెట్రోలు, డీజిల్ ధరలు మరింతగా తగ్గాయి. ఆదివారం నాడు లీటరు పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ పై 17 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో వరుసగా మూడో రోజూ 'పెట్రో' ఉత్పత్తుల ధరలు తగ్గినట్లయింది. నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధరల రూ. 86.90కి, డీజిల్ ధర రూ. 75.19కి చేరింది. ఇక ముంబైలో పెట్రోలు ధర రూ. 87.21కి, డీజిల్ ధర రూ. 78.82కు తగ్గింది. కాగా, గత వారంలో ఇంటర్నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన నాటి నుంచి ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి విదితమే.
Go Back to Shorts
Petrol
Diesel
Price
Hyderabad
OMC's

More Telugu News