l ramana: ఎల్.రమణతో భేటీ అయిన మంద కృష్ణ మాదిగ, చాడ

  • ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సమావేశం
  • మహాకూటమి మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారన్న చాడ
  • కేసీఆర్ తడబడుతున్నట్టు కనిపిస్తోందన్న సీపీఐ నేత    
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, మహాకూటమి మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని చెప్పారు. మహాకూటమికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. ఎన్నికల వ్యూహంపై రమణతో చర్చించామని చెప్పారు. మహాకూటమిని ఏర్పాటు చేసింది టీడీపీ, సీపీఐలే అని తెలిపారు. కేసీఆర్ వాగ్దానాల తీరు చూస్తుంటే... ఆయన ఎంతో తడబడుతున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. 
l ramana
chada venkata reddy
manda krishna madiga

More Telugu News