Mahesh Babu: సుకుమార్ వినిపించిన లైన్ పట్ల ఆసక్తి చూపని మహేశ్?

  • వంశీ పైడిపల్లితో మహేశ్ మూవీ 
  • తదుపరి సినిమా సుకుమార్ తో 
  • కథపై కసరత్తు చేస్తోన్న సుకుమార్  
ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత మహేశ్ .. సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక లైన్ ను మహేశ్ కి సుకుమార్ వినిపించాడట .. రజాకార్ల నేపథ్యంలో సాగే కథ అది.

ప్రస్తుతం హీరోలంతా చారిత్రక నేపథ్యం కలిగిన కథలకు ప్రాముఖ్యతను ఇస్తోన్న తరుణంలో, రజాకార్ల నేపథ్యంలో సాగే కథ చేద్దామని సుకుమార్ ఉత్సాహాన్ని చూపించాడట. అయితే, వివాదాలు తెచ్చిపెట్టే కథలను టచ్ చేయవద్దనీ .. మరో కథను  సిద్ధం చేయమని మహేశ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో రెండు విభిన్నమైన కథలను సుకుమార్ రెడీ చేస్తున్నాడట. మహేశ్ బాబుకి ఏ కథ నచ్చితే ఆ కథతో సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.    
Mahesh Babu
sukumar

More Telugu News