rail accident: ప్రజల తప్పిదానికి రైల్వే శాఖను నిందిస్తే ఎలా?: బోర్డు చైర్మన్‌ అశ్వని లోహాని

  • అమృతసర్‌లో ఘటన స్వీయ తప్పిదం
  • దసరా ఉత్సవాల సందడిలో పడి జనం రైళ్ల రాకను పట్టించుకోలేదు
  • కనీసం శాఖాపరంగా ముందస్తు సమాచారం కూడా లేదు

‘అమృతసర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం బాధాకరమే...కానీ ఇది ప్రజల స్వీయ తప్పిదం. దీనిపై రైల్వే శాఖను నిందించడం సరికాదు’ అని రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లోహాని అన్నారు.  శుక్రవారం రాత్రి రావణ దహన వేడుకలు వీక్షిస్తున్న వారిపైకి రైలు దూసుకుపోవడంతో అరవై ఒక్కమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. శనివారం లోహాని ఘటనా స్థలిని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు సంబంధించి రైల్వే శాఖకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదన్నారు. ‘ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం మెయిన్‌ లైన్‌. దానిపై ఎటువంటి వేగ నియంత్రణ ఉండదు. ఘటన జరిగిన సమయంలో ఈ లైనులో ఉన్న రెండు క్రాసింగ్‌లు మూసివేసి ఉన్నాయి’ అని లోహాని తెలిపారు. ప్రమాదాన్ని విస్మరించి ప్రజలు ట్రాక్‌పైకి చొచ్చుకు వచ్చారని, వారు కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని లోహాని అన్నారు. కాగా, గురునానక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పంజాబ్‌ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ నేడు పరామర్శించారు.

More Telugu News