Kurnool District: తాళాలు వేసిన అమ్మవారి గుడిలో అర్ధరాత్రి మహిళ ప్రదక్షిణలు... సీసీటీవీ ఫుటేజ్ చూసి అమ్మవారేనంటున్న భక్తులు!
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. అమ్మవారి ఆలయానికి రాత్రి వేళలో తాళాలు వేసిన తరువాత, ఓ మహిళ పసుపు పచ్చని చీరతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
జ్వాలాముఖి ఆలయాన్ని తాము రాత్రి 10 గంటలకే మూసేశామని, ఆ తరువాత ఆలయం లోపల ఎవరూ ఉండే అవకాశం లేదని నిర్వాహకులు చెబుతుండగా, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది స్వయంగా అమ్మవారేనని భక్తులు అంటున్నారు. రాత్రిపూట తమకు గజ్జెల చప్పుడు కూడా వినిపించిందని చుట్టుపక్కల ఉన్న కొందరు చెబుతున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి వైరల్ కావడంతో ఈ ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.