Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాధ్యతల గురించి కాజల్ కబుర్లు 
  • అమెరికాలో మహేశ్ 'మహర్షి' షూటింగ్ 
  •  థాయిలాండులో 'ఎఫ్ 2' టీమ్ సందడి

*  'సినిమా జయాపజయాల ఫలితాన్ని ఎవరో ఒకరికి ఆపాదించడం సమంజసం కాదు..' అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఒక సినిమా హిట్టయిందంటే అందరి భాగస్వామ్యం ఫలించినట్టే. అలాగే ఫెయిల్ అయిందంటే ఆ బాధ్యత కూడా అందరికీ వర్తిస్తుంది. సక్సెస్ ని ఎలా అయితే అందరూ పంచుకుంటున్నారో, అపజయానికి కూడా అందరూ బాధ్యత వహించాలి. దానికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయకూడదు' అని చెప్పింది.  
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం అమెరికా షెడ్యూలు నిన్న మొదలైంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. సన్నివేశాలతో పాటు కొన్ని పాటలను కూడా అక్కడి షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. హీరోలతో పాటు తమన్నా, మెహ్రీన్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు.

More Telugu News