సమంత నటించే సినిమాలో నాగశౌర్య కీలక పాత్ర?

  • దక్షిణకొరియా చిత్రాన్ని రీమేక్ చేస్తున్న నందిని రెడ్డి
  • కీలక పాత్ర పోషిస్తున్న సమంత
  • నందిని రెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే ఒక చిత్రంలో నటించిన నాగశౌర్య
సమంత ప్రధాన పాత్రధారిగా దర్శకురాలు నందిని రెడ్డి ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దక్షిణకొరియా కామెడీ డ్రామా చిత్రమైన 'మిస్ గ్రానీ' రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో నాగశౌర్య కీలక పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. నందిని రెడ్డి తెరకెక్కించిన 'కల్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. నందిని దర్శకత్వం వహిస్తుండటంతో పాటు... కథ, పాత్ర నచ్చడంతో సినిమాకు నాగశౌర్య ఓకే చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
samantha
nagashourya
nandini reddy
tollywood

More Telugu News