Andhra Pradesh: జగన్ ఓ రాక్షసుడు.. ఆ విషయంలో ఆయన్ను మించినవారు లేరు!: పరిటాల సునీత

  • కోటి మంది డ్వాక్రా మహిళల్నిజగన్ అవమానించారు
  • అసలైన మహిషాసురుడు ప్రతిపక్ష నేతే
  • చంద్రబాబు హయాంలో భారీగా నిధులిచ్చాం
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోటి మంది డ్వాక్రా మహిళలను అవమానించారని టీడీపీ నేత, మంత్రి పరిటాల సునీత అన్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పసుపు'-కుంకుమ’ పథకాన్ని హేళన చేయడం జగన్ రాక్షసత్వానికి పరాకాష్టని వ్యాఖ్యానించారు. జగన్‌ ఓ రాక్షసుడనీ, రాక్షస కృత్యాలు చేయటం, రాక్షస భాష మాట్లాడటంలో ఆయన్ను మించినవారు లేరని సునీత విమర్శించారు. చంద్రబాబును నారాసురుడిగా జగన్ పేర్కొనడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు.

అసలు సిసలు మహిషాసురుడు జగనేనని.. అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లోనూ ‘జగనాసురుడి’ని మర్దించేందుకు ఏపీ మహిళలు మరోసారి సిద్ధమవుతున్నారని అన్నారు. పసుపు'-కుంకుమ పథకం అమలు తీరుతెన్నులపై చర్చకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు జగన్ సిద్ధమేనా? అని సవాలు విసిరారు.

పవిత్ర విజయదశమి పర్వదినాన జగన్‌ లాంటి రాక్షసుడి ప్రస్తావన తీసుకురావాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్‌ హయాంలో డ్వాక్రా మహిళలకు కేవలం రూ.276 కోట్లు మాత్రమే ఇచ్చారనీ.. కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో రూ.11,180 కోట్లు ఇవ్వడాన్ని జగన్‌ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
Andhra Pradesh
jagan
Chandrababu
sunita paritala
Anantapur District
dwakra

More Telugu News