24 నుంచి 28 వరకు రెండోసారి అమేజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌

  • అర్ధరాత్రి ప్రారంభమై చివరి రోజు అర్ధరాత్రి ముగియనున్న ఆఫర్‌
  • ఎక్ల్సూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉంటాయని ఊహాగానాలు
  • అమెజాన్‌ పే యూజర్లకు 250 క్యాష్‌ బ్యాక్‌ సదుపాయం
దసరా సందర్భంగా అక్టోబర్‌ రెండో వారంలో గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ పేరుతో దుమ్మురేపిన ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ రెండో విడత మెగా ఆఫర్‌ను ప్రకటించింది. ఈనెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు మరోసారి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని రెండో విడత అమ్మకాలకు అమెజాన్‌ ముందుకు వస్తోందని భావిస్తున్నారు.

కొనుగోలు సమయంలో అమెజాన్‌ పే యూజర్లకు రూ.250 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఐదు రోజుల పాటు జరగనున్న రెండో రౌండ్‌ సేల్‌లో ఎక్స్‌క్లూజివ్‌ లాంచ్‌లు, ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, హోమ్‌ అప్లియెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ పై పలు డీల్స్‌ను ప్రకటించింది. ఈ సారి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో ప్రతి రోజూ రెడ్‌మి 6ఏ ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనుంది. అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌, మూడో జనరేషన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్స్‌ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లో అందించనుంది. అలెక్స్‌ ఆధారిత డివైజ్‌లకు 70 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌ను కేవలం రూ.19కే అమ్మాలని నిర్ణయించింది. 
Go Back to Shorts
amazon
great indian sale

More Telugu News