chaild raped: ఎనిమిదేళ్ల బాలికపై సొంత బావే అత్యాచారం!

  • మేనమామ కూతురిపైనే అఘాయిత్యం
  • అనాథ అని చేరదీస్తే వక్రబుద్ధి చూపించాడు
  • సూర్యాపేట జిల్లాలో ఘటన

ఎనిమిదేళ్ల బాలికపై ఓ వివాహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదీ సొంతిట్లో తనకు జీవితాన్ని ఇచ్చిన మేనమామ కూతురిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు... ఇదే మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడి తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోయారు. దీంతో అతని మేనమామ ఆ బాలుడిని చేరదీశాడు. రామాపురం గ్రామానికి తీసుకువచ్చాడు. పెంచి పెద్ద చేయడమేకాక పెళ్లి కూడా జరిపించాడు. తనవద్దే పనికి పెట్టుకున్నాడు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలోనే అద్దెకు ఉంటున్నాయి.

 ఈ క్రమంలో నిందితుడు మొబైల్‌ ఫోన్‌లో చిన్నారికి ఆశ్లీల చిత్రాలు చూపిస్తూ గడచిన రెండు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా సదరు యువకుని ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News