sumanth ashwin: ఫస్టులుక్ తోనే భయపెడుతోన్న నందిత శ్వేత

  • ఘన విజయం సాధించిన 'ప్రేమకథాచిత్రమ్'
  • సీక్వెల్ గా 'ప్రేమకథాచిత్రమ్ 2'
  • సుమంత్ అశ్విన్ జోడీగా నందిత శ్వేత  

తెలుగు తెరపై హారర్ కామెడీ సినిమాలు తమ జోరును కొనసాగిస్తూనే వున్నాయి. ఖర్చు సంగతి ఎలా వున్నా కంటెంట్ వుంటే చాలు ఈ తరహా సినిమాలకి ప్రేక్షకులు భారీ వసూళ్లు ముట్టజెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి 'ప్రేమకథాచిత్రమ్ 2' రెడీ అవుతోంది. గతంలో సుధీర్ బాబు - నందిత జంటగా వచ్చిన 'ప్రేమకథా చిత్రమ్' సినిమాకి సీక్వెల్ ఇది.

గతంలో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో, సీక్వెల్ కి శ్రీకారం చుట్టారు. ఈ సీక్వెల్లో సుమంత్ అశ్విన్ .. నందిత శ్వేత జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నందిత శ్వేత ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఏదోశక్తి ఆవహించిన పెళ్లి కూతురుగా నందిత శ్వేతను చూపిస్తూ, ఫస్టులుక్ తోనే సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి హరికిషన్ దర్శకత్వం వహిస్తున్నాడు.   

More Telugu News