varun tej: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'అంతరిక్షం' టీజర్

  • సంకల్ప్ రెడ్డి నుంచి 'అంతరిక్షం' 
  • వ్యోమగామిగా వరుణ్ తేజ్ 
  • డిసెంబర్లో సినిమా విడుదల  

వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ .. అదితీ రావు వ్యోమగాములుగా నటిస్తున్నారు. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

టైటిల్ కి తగినట్టుగానే అంతరిక్షానికి సంబంధించిన సన్నివేశాలపై టీజర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన ఈ టీజర్ ద్వారా కథ చెప్పే ప్రయత్నం చేయకుండా, అందరిలో ఆసక్తిని పెంచడంలో టీమ్ సక్సెస్ అయింది. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.

More Telugu News