akshay kumar: 'కాంచన' హిందీ రీమేక్ లో స్టార్ హీరో

  • అక్షయ్ కుమార్ కి విపరీతమైన క్రేజ్ 
  • 'కాంచన' రీమేక్ పై దృష్టి 
  • దర్శకుడిగా రాఘవ లారెన్స్    

బాలీవుడ్ అగ్రకథానాయకుల జాబితాలో అక్షయ్ కుమార్ పేరు కూడా కనిపిస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుని .. విలక్షణమైన పాత్రలను చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. అలాంటి అక్షయ్ కుమార్ త్వరలో ఓ హారర్ సినిమా రీమేక్ లో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం.

ఆ హారర్ సినిమా ఏదో కాదు .. 'కాంచన'. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ .. తెలుగు భాషల్లో కాసుల వర్షం కురిపించింది. అలాంటి ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. హిందీలోనూ లారెన్స్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేయనున్నారు.    

More Telugu News