prashant kishor: ప్రశాంత్ కిషోర్ కు నెంబర్-2 స్థానాన్ని అప్పగించిన నితీశ్ కుమార్!

  • గత నెలలో జేడీయూలో చేరిన ప్రశాంత్ కిషోర్
  • పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించిన నితీష్ కుమార్
  • ప్రశాంత్ కిషోర్ నియామకం పార్టీ భవిష్యత్తును మార్చబోతోందన్న కేసీ త్యాగి
వైసీపీ ఎన్నికల ప్రచారవ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత నెలలో జేడీయూలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరి కొన్ని రోజులు కూడా గడవక ముందే ఆయనకు ఊహించని పదవి లభించింది. పీకేకు పార్టీలో నెంబర్-2 స్థానాన్ని జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టబెట్టారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఆయనను నియమించారు. ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిన తర్వాత నితీశ్ కుమార్ మాట్లాడుతూ, తన రాజకీయ వారసుడిగా ఆయనను అభివర్ణించారు. ఆయన 'తమ భవిష్యత్తు దారి' అంటూ కితాబిచ్చారు. చెప్పిన విధంగానే తన తర్వాతి స్థానంలో ఇప్పుడు కూర్చోబెట్టారు.

ఈ సందర్భంగా జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మాట్లాడుతూ, ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్ కిషోర్ నియామకం పార్టీ భవిష్యత్తును మార్చబోతోందని చెప్పారు. ఇప్పటిదాకా తమ సపోర్ట్ బేస్ సంప్రదాయబద్ధంగానే ఉందని... ఇకపై పలు కోణాల్లో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లబోతున్నామని తెలిపారు.
prashant kishor
jdu
vice president
nitish kumar
kc tyagi

More Telugu News