Honor 8X: అద్భుత ఫీచర్ లతో ఆనర్ 8ఎక్స్‌ స్మార్ట్ ఫోన్ విడుదల!

  • కాసేపటి క్రితం భారత మార్కెట్లో విడుదల 
  • రెండు వేరియంట్ లలో లభ్యం
  • ఈ నెల 24 నుండి అమెజాన్ సైట్‌ లో విక్రయం

హువావే సబ్ బ్రాండ్ సంస్థ అయిన ఆనర్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ కాసేపటి క్రితం భారత మార్కెట్లో విడుదల అయింది. ఆనర్ 8ఎక్స్‌ పేరిట విడుదలైన ఈ ఫోన్లో భారీ డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరాలు లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ నెల 24 నుండి అమెజాన్ సైట్‌ లో ప్రత్యేకంగా విక్రయించనున్న ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ వేరియంట్ లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.14,999 ఉండగా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.18999గా ఉంది.

ఆనర్ 8ఎక్స్ ఫీచర్లు:

  • వెనక భాగంలో 20/2 మెగాపిక్సల్ కెమెరాలు
  • ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6.5" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2340 x 1080 రిజల్యూషన్)
  • 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌ లాక్
  • 3750ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News