sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. బేస్ క్యాంప్ కు చేరుకున్న మహిళలు

  • రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయ తలుపులు
  • ఆలయంలోకి వెళ్లేందుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్న మహిళలు
  • ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన నిరసనకారులు
శబరిమల  ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ అట్టుడుకుతోంది. రేపు శబరిమల ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు బేస్ క్యాంప్ వద్దకు మహిళలు చేరుకున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మహిళా నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజా పరిస్థితులపై చర్చించడానికి ట్రావెన్ కోర్ దేవాలయం సమావేశమయింది. మరోవైపు, సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయబోమని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.
sabarimala
women
entry
keral

More Telugu News