karnataka: కోరిక తీర్చాలన్న బ్యాంక్ మేనేజర్.. చితగ్గొట్టిన మహిళ.. వీడియో చూడండి

  • లోను కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళ
  • శారీరక సుఖం కావాలన్న బ్యాంకు మేనేజర్
  • కర్ర పట్టుకుని చితగ్గొట్టిన బాధితురాలు
తన కోరిక తీర్చాలన్న బ్యాంక్ మేనేజర్ కు చుక్కలు చూపించిందో అపరకాళిక. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, లోను కోసం ఒక మహిళ బ్యాంకుకు వెళ్లింది. లోను మంజూరు చేయాలంటే తన కోరిక తీర్చాలని సదరు బ్యాంక్ మేనేజర్ వెకిలి వేషాలు వేశాడు. ఒళ్లు మండిపోయిన ఆమె... కర్ర తీసుకుని అతనికి దేహశుద్ధి చేసింది. చెప్పుతో కొట్టింది. బయటకు లాక్కొచ్చి అతన్ని చితకబాదింది. తనను వదిలేయాలని, మరోసారి ఇలాంటి తప్పు చేయబోనని ఆమె కాళ్లు పట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్. ఆమె చేసిన పనిని అందరూ హర్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
karnataka
davanagere
bank
manager
sexual favour
woman

More Telugu News