Women: పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు ఏపీ, తెలంగాణలో తక్కువే: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ

  • పనిచేసే ప్రదేశంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులు
  • ఏపీ, తెలంగాణలో మెరుగైన వాతావరణం
  • గణాంకాలు విడుదల చేసిన కేంద్రం

పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొంత మెరుగైన వాతావరణం ఉంది. పనిచేస్తున్న ప్రదేశంలో మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు 2014-17 మధ్య 54 శాతం పెరిగాయి. అయితే, వివిధ పెద్ద రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఏపీ, తెలంగాణలో ఇవి నామమాత్రమేనని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి విభాగం తెలిపింది. ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది.

జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 31 కేసులు నమోదు కాగా, తెలంగాణలో 48 కేసులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది జూలై వరకు ఏపీలో రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, తెలంగాణలో పది కేసులు నమోదయ్యాయి.

లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ 2017లో 570 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూలై నాటికే 533 కేసులు నమోదైనట్టు చెప్పారు. వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేయడం కోసం ఆన్‌లైన్ ఫిర్యాదు విధానం ‘షి బాక్స్’ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.

More Telugu News