Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... వయో పరిమితి సడలింపు పొడిగింపు!

  • ప్రత్యక్ష నియామకాల్లో వయో పరిమితి 42 సంవత్సరాలు
  • గత సంవత్సరం ఇచ్చిన జీవో ముగియడంతో కొత్త జీవో
  • వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకూ అమలులో సడలింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి సడలింపులను కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. గత సంవత్సరం వరకూ ప్రత్యక్ష నియామకాల్లో ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలు కాగా, దానిని 42 ఏళ్లకు సడలిస్తూ 2017 డిసెంబరు 4న జీవో 182ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవో గడువు గడచిన సెప్టెంబరు 30తో ముగియగా, డైరెక్ట్ నియామకాల్లో సడలింపులను వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 30 వరకూ కొనసాగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం నాడు జీవో 132ను విడుదల చేసింది.
Andhra Pradesh
Um employ
Age Limit

More Telugu News