Bollywood: దర్శకుడు శామ్ కౌషల్ నాకు బూతు సినిమాలు చూపించాడు: మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ నమీత

  • నటుడు విక్కీ కౌశల్ తండ్రిపై లైంగిక ఆరోపణలు
  • ఔట్ డోర్ షూటింగ్‌ల సమయంలో వేధింపులు
  • ఆరోపించిన మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ నమీత
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలోకి బాలీవుడ్‌కు చెందిన మరో దర్శకుడు చేరాడు. ఇప్పటికే ఈ జాబితాలో నానా పటేకర్, అలోక్ నాథ్, వికాస్ బహ్ల్, సాజిద్ ఖాన్, సుభాష్ ఘాయ్, భూషణ్ కుమార్, ముకేశ్ చబ్రా తదితరులు ఉండగా తాజాగా, యాక్షన్ చిత్రాల దర్శకుడు, నటుడు విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ కూడా చేరాడు.

శామ్ కౌశల్ వద్ద గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నమీత ప్రకాశ్ లైంగిక ఆరోపణలు చేసింది. ఔట్ డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు తనను లైంగికంగా వేధించేవాడని ఆరోపించింది. 2006లో ఓసారి ఔట్‌డోర్ షూటింగ్‌ సమయంలో తన గదిలోకి తీసుకెళ్లి వోడ్కా తాగమని బలవంతం చేశాడని, పోర్న్ క్లిప్‌లు చూపించాడని పేర్కొంటూ ట్వీట్ చేసింది.

మనోరమ సిక్స్ ఫీట్ అండర్, అబ్ తక్ చప్పన్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సినిమాలకు నమీత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. కాగా, నమీత ఆరోపణలపై శామ్ కౌశల్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Bollywood
Vicky Kaushal
Sham Kaushal
sexual misconduct
Nameeta

More Telugu News