Chandrababu: అవినీతిపరుల భరతం పడుతుంటే కక్షసాధింపు చర్యలంటారేంటి?: కన్నా లక్ష్మీనారాయణ

  • సీఎం రమేశ్ కు వ్యాపారాలు ఉన్నాయా? లేవా?
  • పదవులు కొనుక్కొని పన్నులు ఎగ్గొట్టచ్చా?
  • సీఎం చంద్రబాబు ప్రశ్నించడమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తగదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉండి, రాజ్యాంగబద్ధమైన సంస్థలను చంద్రబాబు ప్రశ్నించడమేమిటని అన్నారు.

ఏపీలో వ్యాపారస్తుల నివాసాలపై గతంలో ఎప్పుడూ ఐటీ దాడులు జరగలేదా? టీడీపీ నేత సీఎం రమేశ్ కు వ్యాపారాలు, కాంట్రాక్ట్స్ ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనతో పదవులు కొనుక్కొని.. పన్నులు ఎగ్గొట్టచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపరుల భరతం పడతామని నరేంద్ర మోదీ ప్రధాని అయిన రోజునే చెప్పారని, అవినీతిపరుల భరతం పడుతుంటే కక్షసాధింపు చర్యలని అంటారేంటని ప్రశ్నించిన కన్నా, ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు.

More Telugu News