Pawan Kalyan: పవన్ కల్యాణ్ బహిరంగసభ వద్ద కూలిన రేకుల షెడ్డు.. తప్పిన ప్రమాదం

  • ఓ పాత రేకుల షెడ్డుపై కెక్కిన అభిమానులు
  • కుప్పకూలిన వైనం
  • ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పై జనసేన పార్టీ కవాతుఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. పదమూడు జిల్లాల నుంచి తరలివచ్చిన జనసైనికులు ఈ కవాతులో పాల్గొన్నారు. ‘జనసేన’ జెండాలు, అన్ని మతాలు ఒక్కటేనని తెలుపుతూ రూపొందించిన జెండాలను చేతపట్టిన పవన్ అభిమానులు ముందుకు సాగుతున్నారు. తీన్ మార్ డప్పులతో ఆ ప్రాంతం మార్మోగిపోతోంది. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్న బహిరంగ సభా వేదిక వద్ద ఓ పాత రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ రేకుల షెడ్డుపై పార్టీ అభిమానులు ఎక్కడంతో ఈ రేకుల షెడ్డు కూలింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. అందరూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం.

More Telugu News