అర్జెంటీనాలో భేటీ కానున్న జిన్ పింగ్, మోదీ!

15-10-2018 Mon 14:34
  • వచ్చే నెలలో అర్జెంటీనాలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు
  • ఈ సందర్భంగా భేటీ కానున్న మోదీ, జిన్ పింగ్
  • ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఇరువురు నేతలు
ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చుకునే క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భారత ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని భారత్ లో చైనా రాయబారి లూవో జాహూయి తెలిపారు. వచ్చే నెలలో అర్జెంటీనాలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా సమావేశం కాబోతున్నారని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్తల కోసం ఇండియా-చైనాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా లూవో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.