మా బతుకు మేము బతుకుతాం.. పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలి: వీహెచ్

15-10-2018 Mon 14:02
  • తెలంగాణలో జనసేన పోటీ చేయరాదు
  • రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం
  • కాకా కుటుంబానికి కాంగ్రెస్ లో జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదు

తెలంగాణలో జనసేన పోటీ చేయరాదని... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. తమ బతుకు తాము బతుకుతామని చెప్పారు. తాను చేపట్టిన యాత్రకు ప్రజా స్పందన బాగుందని తెలిపారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని మరోసారి చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం ఖాయమని తెలిపారు.

వెంకటస్వామి (కాకా) కుటుంబానికి కాంగ్రెస్ లో జరిగినంత న్యాయం ఎక్కడా జరగలేదని చెప్పారు. ఆయన కుమారుడు వినోద్ లాంటి వాళ్లను మళ్లీ కాంగ్రెస్ లో చేర్చుకుంటే, కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతారని తెలిపారు. తనకు సమయాన్ని కేటాయిస్తే తమ అధినేత రాహుల్ గాంధీకి అన్నీ చెబుతానని అన్నారు.