Jana Sena: రేపు ‘జనసేన’ కవాతు.. కదం తొక్కనున్న రెండు లక్షల మంది జన సైనికులు

  • మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభం
  • పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం వరకు కవాతు
  • తరలివెళ్లనున్న13 జిల్లాల జనసైనికులు 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆధ్వర్యంలో ‘జనసేన’ కవాతు నిర్వహించనుంది. గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పై జరగనున్న ఈ కవాతులో రెండు లక్షల మంది జన సైనికులు పాల్గొంటారని సమాచారం.

రేపు మధ్యాహ్నం మూడు గంటలకు పిచ్చుకలంక నుంచి ప్రారంభమై ధవళేశ్వరం వరకు కవాతు కొనసాగనుంది. మొత్తం పదమూడు జిల్లాలకు చెందిన జనసైనికులు తరలిరానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు.

కాగా, ‘జనసేన’ కవాతు కోసం సినీ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి ప్రత్యేకగీతాన్ని రచించారు. కవాతులో భాగంగా కులవృత్తుల వారితో కళారూపాల ప్రదర్శన కూడా ఉంటుంది. కవాతు కార్యక్రమాన్ని రెండు వేల మంది కార్యకర్తలు పర్యవేక్షించనున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు విజ్జేశ్వరం వద్ద, ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చే వాహనాలకు ధవళేశ్వరం, వేమగిరి వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

More Telugu News