junior ntr: అందుకే, ‘అరవింద సమేత’ విజయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వేస్తున్నా: దర్శకుడు త్రివిక్రమ్

  • ‘నన్ను నమ్మి ఈ సినిమా తీయండి..’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు 
  • ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటింది
  • ఇలాంటి నటులను అరుదుగా చూస్తాం 

‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటడానికి కారణం జూనియర్ ఎన్టీఆరేనని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రశంసించారు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఈరోజు జరిగింది.  ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఈ సినిమాకు మొదలు, మధ్య, చివర అన్నీ జూనియర్ ఎన్టీఆరేనని, ఆయన అంత బలమైన నటుడని, ఇలాంటి నటులను చాలా అరుదుగా చూస్తామని చెప్పారు.

 జూనియర్ ఎన్టీఆర్ తన తాతయ్య పేరు నిలబెట్టడమే కాదు, ఆ పేరును మ్యాచ్ చేసే సత్తా ఉన్న నటుడని ప్రశంసించారు. ‘నన్ను నమ్మి ఈ సినిమా తీయండి.. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు’ అని జూనియర్ ఎన్టీఆర్ తనతో అన్నారని, అందుకే, ఈ చిత్ర విజయాన్ని ఆయన ఖాతాలో వేస్తున్నానని చెప్పారు.

More Telugu News