NTR: అరుదైన రికార్డు సాధించిన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్!

  • ఓవర్ సీస్ లో 'అరవింద సమేత' ఘన విజయం
  • 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన వరుసగా నాలుగు చిత్రాలు
  • ఆ ఘనత సాధించిన టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ హీరోగా గత వారంలో విడుదలైన 'అరవింద సమేత వీర రాఘవ' ఘన విజయం సాధించడంతో పాటు, మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును ఎన్టీఆర్ కు సొంతం చేసింది. ఓవర్‌ సీస్‌ లో భారీ కలెక్షన్లను రాబడుతున్న ఈ సినిమా, ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) వసూలు చేసింది.

ఈ స్థాయిలో ఓవర్ సీస్ వసూళ్లు సాధించిన హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఉన్నప్పటికీ, వీరెవరూ తమ వరుస నాలుగు చిత్రాల్లో ఇంత కలెక్షన్లు సాధించలేదు. ఆ రికార్డు యంగ్ టైగర్ కే సొంతమైంది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌', 'జై లవకుశ' చిత్రాలు 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు సాధించగా, ఇప్పుడు ఆ జాబితాలోకి 'అరవింద సమేత' కూడా చేరిపోయింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో ఎన్టీఆరే కావటం గమనార్హం.

More Telugu News