KCR: హరీశ్‌రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్నది అవాస్తవం: ఎంపీ కవిత

  • కేసీఆర్‌కు సీఎం పదవి చాలా చిన్నది
  • కాబోయే సీఎం కేటీఆర్ అన్న చర్చ లేదు
  • పార్టీని కలుషితం చేస్తే ఊరుకోం
హరీశ్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారన్నది అవాస్తవమని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. పార్టీ కోసం హరీశ్‌రావు, కేటీఆర్ కష్టపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ.. కేంద్రంలో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. తనను అసెంబ్లీకి పంపాలని, మంత్రిని చేయాలనే ఆలోచన పార్టీకి లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కు సీఎం పదవి చాలా చిన్నదని.. కేసీఆర్ ఆలోచనలన్నీ రేపటి తరం కోసమేనని కవిత వెల్లడించారు. కాబోయే సీఎం కేటీఆర్ అన్న చర్చ పార్టీలో లేదని కవిత స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టే డీఎస్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్టు ఆమె తెలిపారు. పదవుల్లో ఉన్న వాళ్లు పార్టీని కలుషితం చేస్తే ఊరుకునేది లేదని కవిత స్పష్టం చేశారు. 
KCR
K Kavitha
Harish Rao
KTR
DS
Bhupathi Reddy

More Telugu News