Jana Sena: ‘జనసేన’ కవాతు సాంగ్ త్వరలోనే విడుదల చేస్తాం: పవన్ కల్యాణ్

  • తమన్ బాణీలు అద్భుతంగా ఉన్నాయి
  • కవాతు’ సంక్పలం ప్రతిబింబించేలా రామజోగయ్య సాహిత్యం: పవన్ ట్వీట్
  • ఈ పాట రికార్డు చేస్తుండగా తీసిన వీడియో పోస్ట్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన ఈ నెల 15న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ కవాతు పాటను రూపొందించారు. ‘పద పదపద పద మెరుపలా పద’ అంటూ సాగిన కవాతు సాంగ్ ను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

త్వరలోనే ఈ కవాతు సాంగ్ ను విడుదల చేయనున్నామని, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన బాణీలు అందించారని చెప్పారు. ‘కవాతు’ సంకల్పాన్ని ప్రతిబింబించేలా పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారని ప్రశంసించారు. ఈ పాటను రికార్డు చేస్తుండగా చిత్రీకరించిన వీడియోను కూడా పవన్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తన ఖుషి చిత్రం గురించి పవన్ ప్రస్తావించారు. 2001లో తాను నటించిన ‘ఖుషి’ చిత్రంలోని ‘యే మేరా జహా..’ పాట కంపోజింగ్ లో అప్పుడు టీనేజ్ లో వున్న తమన్ కీలక పాత్ర పోషించారని పవన్ కొనియాడారు.
Jana Sena
Pawan Kalyan
kavath song

More Telugu News