దుర్గాపూజ కోసం పాటలు రాసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పూజా ఆల్బమ్ ‘రౌద్రాచార్య’తో భక్తుల ముందుకు!
- కొత్త ఆల్బంను విడుదల చేసిన మమతా బెనర్జీ
- ఏడు పాటలు రాసిన సీఎం
- గాత్రమిచ్చిన బెంగాలీ ప్రముఖ గాయకులు
సీఎం రాసిన పాటలను బెంగాలీ ప్రముఖ గాయకులు ఇంద్రనీల్, లోపముద్ర, రూపాంకర్ పాడారు. తాను రాసిన పాటల లింక్‌ను కూడా మమత ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వాటిని విని ఆనందించాల్సిందిగా కోరారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూజ ఉత్సవాలు ఈనెల 14న ప్రారంభమై 19 వరకు కొనసాగనున్నాయి.