sukumar: సుకుమార్ నిర్మాతగా మరో ప్రేమకథా చిత్రం

  • దర్శకుడిగా వరుస విజయాలు 
  • నిర్మాతగా కొత్త ప్రాజెక్టులు 
  • నాగశౌర్య - రష్మికలతో సినిమా  

ఒక వైపున అగ్ర హీరోలతో కలిసి దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటోన్న సుకుమార్, మరో వైపున నిర్మాతగా ఓ మారి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలతో తన అసిస్టెంట్స్ కి దర్శకులుగా ఆయన అవకాశాలు ఇస్తుండటం విశేషం. అలా ఆయన తాజాగా తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన కుర్రాడికి దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

సుకుమార్ నిర్మించనున్న ఈ సినిమాలో 'ఛలో' జోడీ నాగశౌర్య .. రష్మిక నటించనున్నట్టు సమాచారం. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో సుకుమార్ వున్నాడని అంటున్నారు. గతంలో సుకుమార్ నిర్మించిన సినిమాలకి ఆయనే కథ - మాటలు అందించాడు. కొత్త ప్రాజెక్టు విషయంలోను అలాగే జరుగుతుందేమో చూద్దాం. 

More Telugu News