ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి!: ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ
- ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో ఘటన
- అండ్రపల్లి వద్ద పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు
- మృతురాలిని రానాగా గుర్తింపు
ఈ నేపథ్యంలో పోలీసులు ఏఓబీని జల్లెడ పడుతున్నారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. కూంబింగ్ సందర్భంగా అండ్రపల్లి వద్ద పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారని, ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయని ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో రానా అనే మహిళ మృతి చెందినట్లు గుర్తించామన్నారు.