metoo: మీటూ కాపీ ఉద్యమమే కావచ్చు...కానీ ప్రయోజనం ఉంది : సుస్మితాసేన్‌

  • మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు చెప్పగలుగుతున్నారు
  • వారు చెప్పేది ముందు వినాలి...తప్పా ఒప్పా అని ప్రశ్నించకూడదు
  • వారికి నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మనది

‘మీటూ ఉద్యమం విదేశాల నుంచి కాపీ కొట్టిందే కావచ్చును. కానీ దీనివల్ల మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోగలుగుతున్నారు. అందువల్ల వారికిది మేలు చేస్తుందనే భావిస్తున్నాను’ అని అందాల సుందరి సుస్మితాసేన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన లోటస్‌ మ్యాకప్‌ ఇండియా ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న ఈ బాలీవుడ్‌ హీరోయిన్‌ తన వాదన వినిపించారు.

మహిళలు చెప్పుకుంటున్న సమస్యలను జాగ్రత్తగా వినాలి, వారికి నైతిక మద్దతు ఇవ్వాలి తప్ప, తప్పా? ఒప్పా? అని ప్రశ్నించకూడదన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి, వారిని ప్రోత్సహించే పనులు చేపట్టాలని సూచించారు. అప్పుడే వారు చేస్తున్న ఉద్యమానికి సార్థకత లభిస్తుందని సుస్మితాసేన్‌ స్పష్టం చేశారు.

More Telugu News