Chandrababu: చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. తిత్లీ తుపాను ప్రభావంపై ఆరా

  • ఏపీ, ఒడిశా సీఎంలకు ప్రధాని ఫోన్
  • ఆస్తి, ప్రాణ నష్టంపై ఆరా
  • అండగా ఉంటామని హామీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి తిత్లీ తుపాను ప్రభావంపై  ఆరా తీశారు. ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

కాగా, తిత్లీ తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. విశాఖపట్టణం నుంచి రోడ్డు మార్గంలో సిక్కోలు చేరుకున్న సీఎం జిల్లా వాసులను కలిసి పరామర్శించారు. సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.

More Telugu News