chiranjeevi: చిరూ .. కొరటాల సినిమా టైటిల్ ఖరారైపోయినట్టే!

  • చిరంజీవితో కొరటాల శివ
  • సంక్రాంతికి సినిమా లాంచ్
  • 'రైతు' టైటిల్ పెట్టే ఆలోచన  

ప్రస్తుతం చిరంజీవి 'సైరా' సినిమా షూటింగులో బిజీగా వున్నారు. చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించిన పనుల్లో కొరటాల తీరికలేకుండగా వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథా వస్తువు ఏమైవుంటుందనే ఆసక్తి అందరిలోను నెలకొంది.

ఈ సినిమాలో చిరంజీవి రైతు బాంధవుడిగా కనిపిస్తారట. రైతుల తరఫున నిలవబడి .. వాళ్ల సమస్యలపై పోరాడే శక్తిగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనున్నారని సమాచారం. కొరటాల సినిమాల్లో సందేశం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ సినిమాలోనూ ఒక సందేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి 'రైతు' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట. సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.   

More Telugu News