నేలరాలిన భారీ వృక్షాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు... సాయంత్రం వరకూ కొనసాగనున్న తిత్లీ ప్రభావం!
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- తెలంగాణకూ వర్ష సూచన
తిత్లీ ప్రభావం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపైనా కనిపించింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీరంలో అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండగా, రహదారి ధ్వంసమైంది. రోడ్డు తెగిపోయి, సమీపంలోని ఇళ్లలోకి సముద్రపు నీరు చేరింది. దీంతో కాకినాడ - ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లిన సంజీవరావు అనే మత్స్యకారుడు మరణించాడు.