వంగవీటి రాధాను కలిసిన విజయసాయిరెడ్డి.. సుదీర్ఘ చర్చలు!
- ఇన్ ఛార్జిగా మల్లాదిని నియమించడంపై రాధా అలక
- విజయవాడలో రాధా నివాసానికి వెళ్లిన విజయసాయి
- సుమారు గంట సేపు చర్చలు?
కాగా, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న రాధా, వైసీపీ కార్యక్రమాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాధాను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నేరుగా రాధాను ఇటీవల కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఫలితం లేకపోవడంతో రాధాను అనునయించేందుకు విజయసాయిరెడ్డి ఈరోజు కలిసినట్టు పార్టీ వర్గాల సమాచారం.