paruchuri: నేరం చేసినవాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఇష్టం లేకపోతే విడిపోండి 
  • ప్రశాంతంగా జీవించండి 
  • హత్యలు చేయించడం మన సంస్కృతి కాదు

భార్యా భర్తలు ఒకరిని ఒకరు చంపించుకునే సంఘటనల సంఖ్య ఇటీవల పెరుగుతూ వెళుతోంది. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఆ సంఘటనల గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'నాతి చరామి' అనే ప్రమాణంతో వివాహం జరుగుతుంది. స్త్రీ .. పురుషుల వివాహం కారణంగా ఒక కుటుంబం ఏర్పడుతుంది. వావి వరుసలతో కూడిన నాగరికత .. సంస్కృతి మన సొంతం. అలాంటి సంస్కృతిలో నుంచి వచ్చిన భార్యాభర్తలు ఒకరిని ఒకరు దారుణంగా చంపిస్తున్నారు.

ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నాం మనం అనిపిస్తోంది. ఈ సమయంలో నేను ఒకటే చెప్పదలచుకున్నాను. చంపేసి తప్పించుకోవచ్చనే ఆలోచనను దయచేసి మీ బుర్రల్లో నుంచి తీసిపారేయండి. నేరం చేసినవాళ్లు ఎవరైనా ఈ రోజు కాకపోతే రేపు .. రేపు కాకపోతే ఎల్లుండి దొరికి తీరుతారు. అందువలన నేరం చేయాలనే ఆలోచన రానీయకండి. ఇష్టం లేకపోతే .. పొరపాటున భగవంతుడు మిమ్మల్ని కలిపాడనుకుని విడిపోయి ప్రశాంతంగా జీవించండి. హత్యలు చేయించడమనేది మన సంస్కృతి కాదనే విషయం మరిచిపోకండి" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News