నిద్రపోతున్న వారిపై కత్తులతో దాడి.. ముగ్గురి మృతి!
- పాత కక్షల నేపథ్యంలో దాడి
- దంపతులతోపాటు కూతురు మృతి
- ఢిల్లీలో బుధవారం తెల్లవారు జామున ఘటన
బుధవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న మిథిలేష్, సియా, నేహ, సూరజ్ లపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో మిథిలేష్, సియా, నేహాలు అక్కడికక్కడే మృతి చెందగా, సూరజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు.