ram: విశాఖలో రామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • రామ్ హీరోగా 'హలో గురు'
  • ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 18వ తేదీన విడుదల  

రామ్ .. అనుపమ పరమేశ్వరన్ జంటగా 'హలో గురు ప్రేమకోసమే' సినిమాను దర్శకుడు త్రినాథరావు రూపొందించాడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ వేడుకను గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ప్రణీత ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో డీలాపడిన రామ్, ఈ సినిమాతో హిట్ కొడతాడనే నమ్మకంతో అభిమానులు వున్నారు. 

More Telugu News