mukhesh ambani: రూ. 80వేల కోట్ల మేర కరిగిపోయిన ముఖేష్ అంబానీ సంపద!

  • సెన్సెక్స్ ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోవడానికి ఒక రోజు ముందు సంపద 50.7 బిలియన్ డాలర్లు
  • ప్రస్తుత సంపద 39.5 బిలియన్ డాలర్లు
  • స్టాక్ మార్కెట్ల పతనంతో ఆవిరవుతున్న సంపన్నుల సంపద  
రూపాయి పతనం, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, బ్యాంకుల మొండి బకాయిలు, అంతర్జాతీయ అనిశ్చితులు తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు మన దేశ కుబేరుల సంపద కూడా అమాంతం కరిగిపోయింది.

 సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి అయిన 38,989 పాయింట్లకు చేరుకోవడానికి ఒక రోజు ముందు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద అక్షరాలా 50.7 బిలియన్ డాలర్లు. అయితే, ఏడాది పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకున్న లాభాలన్నీ ఒక్క నెలలోనే తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ప్రస్తుతం ఆయన సంపద 39.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 
mukhesh ambani
reliance
worth

More Telugu News