brahmos: బ్రహ్మోస్ క్షిపణి యూనిట్ లో ఐఎస్ఐ గూఢచారి.. అరెస్ట్!

  • నాగపూర్ యూనిట్లో నిశాంత్ అగర్వాల్ అనే గూఢచారి అరెస్ట్
  • గూఢచర్యం వెనుక మరో ఏజెన్సీ కూడా ఉన్నట్టు డౌట్
  • కాన్పూర్ లోని ఇద్దరు సైంటిస్టుల ప్రమేయం కూడా ఉన్నట్టు అనుమానం

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పన్నిన మరో పన్నాగం బయటపడింది. భారత్ అమ్ములపొదిలో ఉన్న కీలకమైన బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన నాగపూర్ యూనిట్లో పాక్ గూఢచారిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈరోజు అరెస్ట్ చేసింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ఫెసిలిటీ యూనిట్ వద్ద గూఢచారిని అరెస్ట్ చేశారు. ఇతన్ని నిశాంత్ అగర్వాల్ గా గుర్తించారు.

మిసైల్ సిస్టమ్ కు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి ఐఎస్ఐకి ఇతను లీక్ చేస్తున్నాడని భావిస్తున్నారు. ఇతనికి ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ గూఢచర్యం వెనుక మరో ఏజెన్సీ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కాన్పూర్ లోని మరో ఇద్దరు సైంటిస్టుల ప్రమేయం కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, నాగపూర్ యూనిట్లో బ్రహ్మోస్ క్షిపణులకు ప్రొపెల్లెంట్, ఇంధనం వంటిని సమకూరుస్తున్నారు.

More Telugu News