నాగార్జునతో 'ప్రేమ నగర్' చేద్దామని రామానాయుడు గారు అన్నారు: రాఘవేంద్రరావు
- నాన్నగారి ప్రభావం నాపై వుంది
- ఆయనని చూసి నేర్చుకున్నాను
- అందుకే అక్కినేనితో ఎక్కువ సినిమాలు చేయలేదు
అందరూ సినిమా బాగుందని అనేవారు గానీ, డబ్బులు వచ్చేవి గాదు. ఆ లోటును భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకుడిగా నాన్నగారు చేసిన పొరపాట్లు నేను చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆయన చేసిన సినిమాల్లో 'ప్రేమ నగర్ ' సెన్సేషనల్ హిట్. అంతకన్నా బాగా సినిమా తీయలేనేమోననే ఉద్దేశంతోనే నాగేశ్వరరావుగారితో ఎక్కువ సినిమాలు చేయలేదు. రామానాయుడుగారు .. 'ప్రేమ నగర్' ను మళ్లీ నాగార్జునతో చేద్దామని అన్నారు. అంత సాహసం చేయొద్దండీ .. అటు నాగార్జునకి పేరు పోతుంది .. ఇటు మనకి పేరు పోతుందని వారించానని చెప్పుకొచ్చారు.