Harish Rao: తెలంగాణను నిలబెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. పడగొట్టాలని టీడీపీ చూస్తోంది!: హరీశ్ రావు

  • తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు 
  • మాపై పోటీకి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి
  • పాతబట్టలన్నీ కలిపి కుట్టిన బొంత ‘మహాకూటమి’

తెలంగాణను నిలబెట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే, పడగొట్టాలని టీడీపీ చూస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడితో టీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై ఆయన నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లాలోని కోడూరు మండలం మందపల్లి గ్రామస్థులు ఏర్పాటు చేసిన తీర్మానసభకు హాజరైన హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై పోటీ పడేందుకు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, వారికి జెండా, అజెండా ఏమీ లేదని, పాతబట్టలన్నీ కలిపి కుట్టిన బొంతలా మహాకూటమి పరిస్థితి ఉందని విమర్శించారు.

More Telugu News