Yamini Sadineni: టీడీపీ అధికార ప్రతినిధిగా సాదినేని యామిని.. ప్రకటించిన చంద్రబాబు

  • యామిని సేవలను గుర్తించిన టీడీపీ
  • అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు ప్రకటన
  • సంతోషం వ్యక్తం చేసిన యామిని
టీడీపీకి మరో అధికార ప్రతినిధి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పార్టీకి విశేష సేవలు అందిస్తున్న సాదినేని యామినిని పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. పార్టీ అభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. తనను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించడంపై సాధినేని యామిని సంతోషం వ్యక్తం చేశారు. మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని, పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.
Yamini Sadineni
Telugudesam
Chandrababu
Spokesperson
Guntur District

More Telugu News