Chandrababu: మోదీ పతనం అక్కడి నుంచే ప్రారంభం కావాలి: చంద్రబాబు

  • ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే బీజేపీ పతనం
  • ఎన్నికలకు ముందు బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక
  • ఆయా రాష్ట్రాల్లో చంద్రబాబు ప్రచారం
నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని  గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. శనివారం రాత్రి ఉండవల్లిలో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశంలో చంద్రబాబు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే ఆ దిశగా పనిచేయాలని, అక్కడి నుంచే మోదీ పతనం ప్రారంభం కావాలని అన్నారు.

బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయానికి అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, మాయావతి వంటి వారిని ఒకే తాటిపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం అయితే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
Chandrababu
Narendra Modi
Elections
Telugudesam
Amaravathi
BJP

More Telugu News