samanta: వచ్చేవారం నుంచి 'మజిలీ'కి సమంత, చైతూ

  • శివ నిర్వాణ నెక్స్ట్ మూవీగా 'మజిలీ' 
  • మరోసారి జోడీ కడుతోన్న చైతూ .. సమంత 
  • ముఖ్యమైన పాత్రలో దివ్యాంశ కౌశిక్  

శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చైతూ .. సమంత జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. సమంత, చైతూ విదేశాల్లో ఉండటం వలన, ఇతర పాత్రలతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు. వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగులో సమంత .. చైతూ పాల్గొననున్నారు.

 భార్యాభర్తలుగానే ఈ సినిమాలో వాళ్లు కనిపించనుండటం విశేషం. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి నటిస్తోన్న సినిమా ఇదే కావడం వలన, అందరిలోను ఆసక్తి వుంది. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. 'నిన్నుకోరి ' సినిమాతో దర్శకుడిగా యూత్ ను మెప్పించిన శివ నిర్వాణ, ఈ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు. హిందీ నటి దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం అదనపు ఆకర్షణ కానుంది.    

More Telugu News