Subhagruha: 'శుభగృహ' రియల్ ఎస్టేట్ కార్యాలయాలపై ఐటీ దాడులు!

  • సోదాలు జరుపుతున్న ఐదు బృందాలు
  • విజయవాడ, విశాఖ నగరాల్లో సోదాలు
  • పలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించిన శుభగృహ
విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు నిర్మాణ రంగ కంపెనీల్లో నిన్న సోదాలు చేసిన ఆదాయపు పన్ను శాఖల అధికారులు, నేడు 'శుభగృహ' రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని శుభగృహ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ ఉదయం నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఐదు బృందాలు ఈ దాడుల్లో పాలుపంచుకుంటున్నట్టు తెలుస్తోంది.

 ఇటీవలి కాలంలో శుభగృహ సంస్థ, ఏపీలోని పలు నగరాల్లో నూతన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థ లావాదేవీలు, ల్యాండ్ బ్యాంక్, వాటిని ఎప్పుడు, ఎవరి నుంచి కొనుగోలు చేశారు? లావాదేవీలకు వాడిన డబ్బుల వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు సమాచారం. కాగా, నిన్న సదరన్ కన్ స్ట్రక్షన్స్, సదరన్ డెవలపర్స్, బీఎంఆర్ గ్రూప్, బీఎంఆర్ హేచరీస్, వీఎస్ లాజిస్టిక్స్ తదితర కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 
Subhagruha
Vijayawada
Vizag
IT Raids

More Telugu News