Election Commission: నేడే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!

  • కాసేపట్లో మీడియా సమావేశం
  • ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
  • తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదలకానున్నట్టు తెలుస్తోంది. జాతీయ ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి, ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్టు సమాచారం. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుందన్న సంగతి తెలిసిందే. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీ కాలం పూర్తికాగా, తెలంగాణలో మాత్రం ముందుగానే అసెంబ్లీ రద్దయింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ, రెండు నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరిపించి, ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనుంది. 
Election Commission
Telangana
Rajasthan
Madhya Pradesh
Chattisghad
Assembly Elections

More Telugu News