ముంబైలో షాక్... డ్రగ్స్ మత్తులో ఫ్యాషన్ డిజైనర్ ను కొట్టి చంపిన కన్న కొడుకు!

షార్ట్స్‌లో చూడండి
మాజీ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ సునీతను ఆమె కన్న కొడుకే దారుణంగా కొట్టి చంపడం ముంబై పేజ్-3 వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సునీత (45) లోఖండ్ వాలా ప్రాంతంలోని క్రాస్ గేట్ బిల్డింగ్ లో నివసిస్తోంది. ఆమెకు లక్ష్య సింగ్ (22) అనే కుమారుడు ఉన్నాడు. గురువారం రాత్రి తలకు బలమైన గాయాలతో ఉన్న ఆమెను కుమారుడే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లక్ష్య సింగ్ ను విచారించగా, అతనే ఆమెను డ్రగ్స్ మత్తులో హత్య చేసినట్టు తెలిసింది. తల్లితో బాత్ రూములో గొడవ పడిన లక్ష్య సింగ్, ఆమెను గట్టిగా వెనక్కు నెట్టడంతో, తల వాష్ బేసిన్ కు బలంగా తగిలి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తొలుత ఆమె కాలుజారి పడిందని చెప్పిన లక్ష్య సింగ్ మాటలను విశ్వసించినా, ఆపై తమ విచారణలో అతనే హత్య చేశాడని తేలిందని, అతనిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు పెట్టామని పోలీసులు వెల్లడించారు. తల్లీ కొడుకుల మధ్య డబ్బు లేదా ఆస్తులకు సంబంధించిన వివాదం తలెత్తి ఉండవచ్చని తెలిపారు.
Go Back to Shorts
Mumbai
Fashion Designer
Sunita
Murder
Son

More Telugu News